Header Banner

పాసుపోర్ట్‌కి రూల్స్ మారాయ్.. కొత్త నిబంధనలు ఇవే! ఇకపై పాస్‌పోర్ట్‌లో అవి ఉండవు!

  Mon Apr 07, 2025 09:52        Others

విదేశీ ప్రయాణాలు కలలుకంటున్నారా? అయితే ముందుగా మీ పాస్‌పోర్ట్‌ను చెక్‌ చేసుకోండి. భారత పాస్‌పోర్ట్‌దారులకు సంబంధించిన నియమాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేయాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోబోతున్నవారికి ఈ మార్పులు చాలా ముఖ్యం. ఈ కొత్త నిబంధనలు పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియను మరింత సులభంగా, సురక్షితంగా మారుస్తాయని అధికారులు తెలిపారు.

గోప్యతకు ప్రాధాన్యత
భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసింది. జనన సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం నుంచి కలర్ కోడెడ్ పాస్‌పోర్ట్‌లు వరకూ మార్పులు తీసుకొచ్చింది. కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునేవారు, పాత పాస్‌పోర్ట్ రీన్యూవల్ చేయాలనుకునేవారు ఈ మార్పులను గమనించాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడిది తప్పనిసరి పత్రం
2023 అక్టోబర్ 1 లేదా దానికి ముందు జన్మించినవారు తప్పనిసరిగా జనన సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఇది పాస్‌పోర్ట్ దరఖాస్తులో పుట్టిన తేది నిర్ధారణకు ఏకైక ఆధారంగా పరిగణించబడుతుంది. మునుపటిలా ఇతర పత్రాలతో పుట్టిన తేది నిర్ధారించటం ఇకలేదు. జనన సర్టిఫికేట్‌ ఉండే పత్రంగా మాత్రమే అంగీకరిస్తారు. ఇది నమ్మదగిన ఆధారంగా మార్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన మార్పు.


ఇది కూడా చదవండి: యాపిల్ స్ట్రాటజీకి ట్రంప్ షాక్‌.. ఐఫోన్లను అమెరికాకు భారీ ఎగుమతులు! కారణం ఏంటో తెలుసా?


గోప్యతకు బార్కోడ్ ఆధారంగా సాంకేతిక పరిష్కారం
పాస్‌పోర్ట్‌లో వ్యక్తిగత వివరాల పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ, ఇకపై ఇంటి చిరునామా ముద్రించబడదు. బదులుగా చిరునామా బార్కోడ్ రూపంలో పాస్‌పోర్ట్‌లో జతచేయబడుతుంది. దీనిని ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రమే స్కాన్ చేసి చూడగలుగుతారు. ఇతరులకు చిరునామా సమాచారం తెలియదు. ఇది గోప్యత పరిరక్షణకు కీలకమైన అడుగు.

ఇదే పాస్‌పోర్ట్ రంగుల క్రమం
పాస్‌పోర్ట్‌లను ప్రస్తుతం మూడు వేర్వేరు రంగులుగా విభజించారు. ఇది పాస్‌పోర్ట్‌దారుల గుర్తింపును సులభతరం చేస్తుంది.

తెలుపు రంగు – ప్రభుత్వ అధికారులకు

ఎరుపు రంగు – దౌత్య ప్రముఖులకు

నీలి రంగు – సాధారణ పౌరులకు

ఈ కలర్ కోడెడ్ విధానం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

తల్లిదండ్రుల పేర్లకు గుడ్‌బై!
పాస్‌పోర్ట్ చివరి పేజీలో తల్లిదండ్రుల పేర్లు ముద్రించకూడదన్న నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది వ్యక్తిగత సమాచారం పరిరక్షణకు చేసిన మార్పు. ఈ మార్పు ప్రైవసీని మరింత బలోపేతం చేస్తుంది.

పాస్‌పోర్ట్ సేవల విస్తరణ
ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను వేగవంతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న 442 సేవా కేంద్రాలను వచ్చే ఐదేళ్లలో 600కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పాస్‌పోర్ట్ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రావటానికి దోహదపడుతుంది. దరఖాస్తుదారులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PassportRules #NewPassportGuidelines #IndianPassport #PrivacyUpdate